Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ ధనదాహంతో కుటుంబ వ్యవస్థను అగౌరవపరుస్తున్నాడు: వర్ల రామయ్య

Varla Ramaiah criticises Jagan
Advertisement
  • జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకం రగడ
  • జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు
  • జగన్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చాడని వ్యాఖ్యలు 
Advertisement
వైసీపీ అధినేత జగన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల పంపకం వివాదంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ ధనదాహంతో కుటుంబ వ్యవస్థను అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. 

తల్లిని, చెల్లిని బజారుకీడ్చిన జగన్ ఆస్తి కోసం వెంపర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సొంత కుటుంబ సభ్యులను వీధిన పడేసిన అనైతిక చరిత్ర జగన్ ది అని పేర్కొన్నారు. 

నైతిక విలువలకే కాకుండా, భారత కుటుంబ వ్యవస్థకు కూడా తిలోదకాలిచ్చిన వ్యక్తి జగన్ అని వర్ల రామయ్య విమర్శించారు. షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని అన్నారు.
Advertisement
Advertisement
Jagan-Sharmila
Assets Row
Varla Ramaiah
TDP
YSRCP
Congress

More Telugu News